తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

14 కేజీల గంజాయి పట్టివేత 

14 కేజీల గంజాయి పట్టివేత 

మణుగూరు, శోధన న్యూస్ : అక్రమంగా తరలిస్తున్న 14 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు మణుగూరు సిఐ ఎస్ సతీష్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబందించి సిఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మణుగూరు డిఎస్పి వంగ రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సిఎస్పి కాట ప్రాంతంలో సిఐ సతీష్ కుమార్, ఎస్సై మేడ ప్రసాద్ లు వాహాన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమం లో మణుగూరు వైపు నుండి హైదరాబాదుగా వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఒక వాహనంపై అనుమనస్పదంగా  కనిపించడం తో అదుపులోకి తీసుకుని విచారించారు. ఒరిస్సా నుంచి ఇద్దరు వ్యక్తులు బజాజ్ పల్సర్ వాహనంపై 14 కేజీల గంజాయిని తీసుకుని వెళుతుండగా పట్టుకున్నట్లు సిఐ తెలిపారు.  పట్టుకున్న గంజాయి విలువ రూ3,48,250లు ఉంటుందని,   పోదువంతాలు అనే నిందితులిద్దరు కూడా ఒరిస్సా రాష్ట్రంమల్కనగిరి జిల్లా చిత్రకొండ కి చెందినవారేనని, వీరు  రాహుల్ కుమార్ అనే వ్యక్తి ద్వారా  గంజాయిని తీసుకొని హైదరాబాద్ ప్రాంతానికి తరలిస్తున్నారని తెలిపారు.  వీరి వాహనాన్ని, గంజాయిని స్వాధీనపరచుకొని రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *