మద్యం సీసాలు పట్టివేత
దమ్మపేట , శోధన న్యూస్ : ఎన్నికల కోడ్ నేపధ్యం లో అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న 192 మద్యం సీసాలను ఆదివారం పోలీసులు పట్టికున్నారు. మండలపరిధిలోని మందలపల్లి ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద ఆదివారం జరిగింది . మందలపల్లి ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో 192 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు .మద్యం తరలిస్తున్న వాహనాన్ని దమ్మపేట పోలీస్ స్టేషన్ కు తరలించి ఎక్సైజ్ అధికారుల సమక్షంలో మద్యం సీసాలను సీజ్ చేశారు. ఎన్నికల నిబంధనల అమలు నేపథ్యంలో అక్రమంగా వాహనాల్లో మద్యం తరలించినా , బెల్టు షాపుల్లో మద్యం విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో అధికారులు కృష్ణ , ఎక్సయిజ్ అధికారులు పాల్గొన్నారు.