15వ పటాలములో ఘనంగా భారత రాజ్యాంగ సంవిదాన కార్యక్రమం
15వ పటాలములో ఘనంగా భారత రాజ్యాంగ సంవిదాన కార్యక్రమం
సత్తుపల్లి, శోధన న్యూస్ : సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారం 15వ పటాలము నందు భారత రాజ్యాంగ సంవిధాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొన్న పటాలపు కమాండెంట్ పి వెంకట రాములు మాట్లాడుతూ భారత రాజ్యాంగ సంవిధాన కార్యక్రమం జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అంతక ముందు భారత రాజ్యాంగ నిర్మాణంలో ఎందరో మహానుభావులు కృషి ఫలితాలు నేడు అనేక మందికి అందుతున్నాయని, ఇటువంటి వారిని మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సిబ్బంది అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాకుండా మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత దృఢమైన లిఖిత రాజ్యాంగమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి పటాలపు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.