198 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత
198 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత
దమ్మపేట, శోధన న్యూస్ : అక్రమంగా లారీ ద్వారా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఖమ్మం నుండి యానంకు లారీ ద్వారా 198 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ సిఐ లు ప్రవీణ్ కుమార్, సత్యనారాయణ లు మండలంలోని ముష్టిబండ వద్ద ధాబా సమీపంలో లారీని పట్టుకుని దమ్మపేట పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ లారీని స్వాధీనం చేసుకున్నామని సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.