20న జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి
20న జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి
–సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య
మణుగూరు, శోధన న్యూస్: ఈనెల 20వ తేదీన పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరగబోయే పార్టీ మండల, పట్టణ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య పిలుపునిచ్చారు. మంగళవారం సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ఇచ్చిన హామీలు ప్రజలకు ఏ మేరకు చేరాయన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ప్రణాళికలపై సమీక్షించనున్నామన్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, నాయకులు అన్ని వర్గాల ప్రజలు హాజరై జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ పినపాక నియోజకవర్గ కార్యదర్శి సరెడ్డి పుల్లా రెడ్డి, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్న లక్ష్మీకుమారి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి జంగం మోహన్ రావు, పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్, ఏఐటీయూసీ మండల అధ్యక్ష, కార్యదర్శులు తోట రమేష్, అక్కి నరసింహారావు, జిల్లా సమితి సభ్యులు ఎస్కె సర్వర్, కుటుంబరావు. వార్డు మెంబర్ కణితి సత్యనారాయణ. రాజబాబు, వీరయ్య, ఎస్వీ నాయుడు, కన్నబోయిన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.