తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

21 కేజీల ప్రభుత్వ నిషేధిత గంజాయిని స్వాధీనం

 

21 కేజీల ప్రభుత్వ నిషేధిత గంజాయిని స్వాధీనం  

  • అదుపులోకి   ఏడుగురు వ్యక్తులను
  • రెండు కార్లు,04 సెలఫోన్లు సీజ్ 

భద్రాద్రి కొత్తగూడెం , శోధన న్యూస్ :   కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భావన బార్ అండ్ రెస్టారెంట్ ప్రాంతం లో  త్రీ టౌన్ ఎస్ఐ పురుషోత్తం   తన సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా  ప్రక్కన గల రైల్వే స్థలంలో పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది .అనంతరం వారి వద్ద ఉన్న రెండు వాహనాలను తనిఖీ చేయగా నిషేధిత గంజాయిని గుర్తించడం జరిగిందని త్రీటౌన్ సిఐ శివప్రసాద్ తెలియజేశారు.వీరి వద్ద నుండి సుమారుగా 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  మేడ్చల్ జిల్లా చర్లపల్లి కాప్రా మండలం, ఘట్కేసర్ కి చెందిన  బాదల్ రౌత్(సెంట్రింగ్ వర్క్), .ముమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి(డ్రైవర్), .భారత్ నగర్ సిద్దిపేట్ చెందిన  కాలువ వెంకటేష్ అలియాస్  కన్నా (పెట్రోల్ బంక్ వర్కర్ ), గాంధీనగర్ సిద్దిపేట కి చెందిన   మహమ్మద్ సాదుల్(డ్రైవర్ ) మోతే ఆకాశ్(వేల్డింగ్ వర్క్),  మేడ్చల్ జిల్లా. అశోక్ నగర్ కాప్రా మండల్  కి చెందిన నితీష్ యాదవ్ అలియాస్ మోనో , వరంగల్ జిల్లా జఫర్ఘడ్ మండలం    గర్నపల్లి గ్రామం, చెందిన తిరుపతి హరీష్ (ఎయిర్టెల్ WIFI బ్రాడ్ బ్యాండ్ లో జాబ్) లు పట్టుబడిన వారిలో ఉన్నారన్నారు. పట్టుబడిన రెండు కార్లలో ఏడుగురు వ్యక్తులు ఇట్టి గంజాయిని హైదరాబాద్ , సిద్దిపేట నందు విక్రయించడానికి తరలిస్తున్నట్లుగా విచారణలో తేలింది. ఈ ఏడుగురు నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టు నకు తరలించడం జరిగిందని సీఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *