రూ.25వేల విలువైన 5క్వింటాల నల్ల బెల్లం పట్టివేత
రూ.25వేల విలువైన 5క్వింటాల నల్ల బెల్లం పట్టివేత
★ ఆటో స్వాధీనం
★ఇది కూడా మేడారం నుండి అక్రమ నల్ల బెల్లం రవాణా
★కరకగూడెం ఎస్ ఐ రాజేందర్
కరకగూడెం,శోధన న్యూస్ : పోలీస్ శాఖ అక్రమ నల్ల బెల్లం, నాటు సారా విక్రయాల పై కఠినంగా వ్యవహరిస్తున్న వారిలో మాత్రం మార్పు రావడం లేదు. గురువారం ములుగు జిల్లా మేడారం నుండి 2 ఆటోలలో నల్ల బెల్లం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇదే రోజు 12:00 గడవకముందే మరో తెల్లబెల్లం తరలిస్తున్న ఆటో పోలీసులకు పట్టు బడ్డది. కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా మేడారం నుండి ఆటోలో బెల్లం తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు కరకగూడెం మండలం సీతారాంపురం గ్రామం సమీపంలో గురువారం సాయంత్రం ప్రధాన రహదారిపై తనిఖీలు చేపట్టారు.పినపాక వైపు వస్తున్న వాహనాన్ని అనుమానం వచ్చి పరిశీలించగా…5 క్వింటాల నల్లబెల్లం ఉన్నట్లు గుర్తించారు. పినపాక మండలం గోవిందా పురం గ్రామానికి చెందిన కొట్టేం దుర్గయ్య తన ఆటోలో నల్ల బెల్లం తరలిస్తు పోలీసు లకు పట్టుబడ్డాడు .వెంటనే ఆటో ను పోలీసులు కరకగూడెం పోలీసు స్టేషన్ కి తరలించారు.కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆటో కూడా మేడారం నుండి బెల్లం తరలిస్తూ పట్టుబడడం గమనార్హం. ఈ ఒక్క రోజే సారాయికి వినియోగించే బెల్లంతో మూడు ఆటోలు పట్టుబడడం చర్చాంసనీయంగా మారింది. కాగా మేడారం నుండి చెక్ పోస్ట్ దాటుకుంటూ అక్రమ బెల్లం రవాణా కావడం అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. కాగా ఈ తనిఖీ లో పోలీసు సిబ్బంది రాజు,రమేష్, అశోక్ పాల్గొన్నారు.