శ్రీవిద్యాభ్యాస పాఠశాలకు 50 కేజీల బియ్యం పంపిణీ
శ్రీవిద్యాభ్యాస పాఠశాలకు 50 కేజీల బియ్యం పంపిణీ
-విద్యార్థులకు సహపంక్తి భోజనాలు
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఓసి గనిలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న దాసరి రజని తన మాతృమూర్తి సరోజిని జ్ఞాపకార్థంగా స్థానిక సంతోష్ నగర్ లోని శ్రీ విద్యాభ్యాస (బాల వెలుగు) పాఠశాలకు 50 కేజీల బియ్యాన్ని ఆదివారం వితరణగా అందజేశారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పాషా మాట్లాడుతూ తన తల్లి జ్ఞాపకార్థం విద్యార్థుల చదువుకు సహకారం అందించాలని రజని సంకల్పాన్ని అభినందించారు. దాతల ప్రోత్సాహంతో విద్యార్థినీ విద్యార్థులు బాగా చదువుకోవాలని కోరారు, అనంతరం విద్యార్థులకు స్వీట్స్ అందజేశారు, ఈ కార్యక్రమంలో మచ్చ శ్రీనివాస్, చొప్పరి శ్రీలేఖ, బత్తుల జ్యోతి, ఆరే దివ్య, మంగి లాల్, సుహాసిని దేవి, రాధ తదితరులు పాల్గొన్నారు.