58 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
58 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
-ముగ్గురిపై కేసు నమోదు
కారేపల్లి, శోధన న్యూస్ : అక్రమంగా మద్యాన్ని తరలించి విక్రయించేందుకు వెళుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు కారేపల్లి ఎస్సై పు ప్పాల రామారావు,వైరా నియోజకవర్గ స్క్వాడ్ ఇంచార్జ్ కర్లపూడి నవీన్ బాబు తెలిపారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన సుడిగాలి విష్ణుమూర్తి, ఏన్కూరు మండలం రాయమాదారనికి చెందిన ఇమ్మడి కృష్ణ,మండల పరిధిలోని పేరుపల్లి గ్రామానికి చెందిన మోతుపల్లి నాగమణి వద్ద నుండి 58 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వచేసి స్థానికంగా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.ఈ ఎలక్షన్ కోడ్ సమయంలో ఎవరు కూడా మద్యం తరలించడం, అమ్మకాలు చేయడం వంటివి చేపట్టవద్దన్నారు. నిబంధనలు అతిక్రమించి విక్రయాలు జరిపితే కేసు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది,ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.