రేగా గర్జన పాటల సీడిని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రేగా
రేగా గర్జన పాటల సీడిని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రేగా
పినపాక, శోధనన్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం లో ప్రభుత్వ విప్, పినపాక రేగా కాంతారావు శుక్రవారం రేగా గర్జన పాటల సీడి ని లాంఛనంగా ఆవిష్కరించారు. సార్వత్రిక ఎన్నికల నిమిత్తం ప్రచారం కోసం రూపొందించిన పాటల సీడిని ఆవిష్కరించి ఆ పాటలను ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి విన్నారు. ఎన్నికల ప్రచారంలో ఈ పాటలతో నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.