బాధితులకు సత్వర న్యాయం జరిగేలా సమగ్ర విచారణ చేపట్టాలి
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా సమగ్ర విచారణ చేపట్టాలి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రతీ కేసులో సమగ్ర విచారణ చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించి పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. పలు కేసుల వివరాలను గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే భాధితులకు సత్వర న్యాయం అందేలా సమగ్ర విచారణ చేపట్టి భాద్యతగా వ్యవహారించాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బంది అందరూ కూడా వర్టికల్స్ వారీగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, సుజాతనగర్ ఎస్సై జుబేదా , సిబ్బంది పాల్గొన్నారు.