బదిలీ అధికారి కి ఆత్మీయ సన్మానం
బదిలీ అధికారి కి ఆత్మీయ సన్మానం
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పి కే ఓ సి సంక్షేమ అధికారిగా పనిచేసి అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్ ఫర్ లో భాగంగా బదిలీపై శ్రీరాంపూర్ కు వెళుతున్న సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఎండి మదార్ సాహెబ్ వీడ్కోలు సభ నిర్వహించారు. బదిలీ పై వెళ్తున్న సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మదార్ సాహెబ్ ని సహోద్యోగులు పలువురు కార్మిక సంఘాల నాయకులు మాజీ కార్మికులు సంతోష్ నగర్ శ్రీ విద్యాభ్యాస (పూర్వ బాల వెలుగు) పాఠశాల లో పుష్పగుచ్చం శాలువాతో ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు. పీకే ఓసి ప్రాజెక్టు అధికారి సింగరేణి అధికారుల సంఘం (సి ఎం ఓ ఏ ఐ) సింగరేణి విభాగం అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగపర్వంలో బదిలీలు మజిలీలు సర్వసాధారణం అని ప్రతి ఉద్యోగి దానికి సానుకూలంగా స్పందించాల్సి ఉంటుందని, కార్మిక సమస్యల పరిష్కారంలో కార్మికులకు యాజమాన్యానికి ఒక వారధిగా పారిశ్రామిక సంబంధాలు మెరుగుపరచడంలో అర్ధరాత్రి కార్మికులు ఫోన్ చేసినా “తానొవ్వక ఇతరులను నొప్పించక”తక్షణమే స్పందించి పరిష్కారానికి కృషి చేసే అధికారిగా మదార్ సాహెబ్ అందరి మన్ననలు పొందారని ఆయన ప్రశంసించారు. మరెన్నో ఉద్యోగోన్నతి ఆయన్ని వరించాలని ఆకాంక్షిస్తూ వీడ్కోలు పలికారు. అనంతరం పాఠశాల ఆవరణలో మామిడిపండ్ల మొక్కను నాటారు. కార్యక్రమానికి సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో పీకే ఓసి రక్షణ అధికారి మేరుగు లింగబాబు, నూతన సంక్షేమ అధికారి ఓంకారి బాపు, నాయకులు సిల్వేరు గట్టయ్య, షేక్ అబ్దుల్ రవూఫ్, వి వెంకటరత్నం, నంబూరి శ్రీనివాస్,ఎండి షాబుద్దీన్, సారయ్య, ఎండి అహ్మద్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏ మంగీలాల్, పాఠశాల నిర్వాహకులు బి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.