ఈ నెల 13, 14 తేదీలలో ఆదివాసీ పరివార్ జాతీయ సమావేశాలు
ఈ నెల 13, 14 తేదీలలో ఆదివాసీ పరివార్ జాతీయ సమావేశాలు
భద్రాచలం, శోధన న్యూస్ : దేశంలో ఎదుర్కొంటున్న వివిధ ఆదివాసి తెగల సమస్యలఫై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివాసీ పరివార్ జాతీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు భద్రాచలం మాజీ జెడ్పిటిసి, ప్రోగ్రాం కన్వీనర్ గుండు శరత్ తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారుగా 17 కోట్ల మంది ఆదివాసుల సమస్యల పట్ల, ఐదవ,ఆరో షెడ్యూల్ ప్రాంతాల పట్ల కేంద్ర ఆయా రాష్ట్రాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాయని, ప్రభుత్వ విధానాల పట్ల ఆదివాసుల యొక్క మనుగడ, గుర్తింపు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి సంఘాల్లో ఉన్న జాతీయ నాయకత్వాన్ని ఒకే వేదిక పైకి తీసుకురావాలని ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాంజీ గో oడు, బీర్స ముండా, రాణి దుర్గావతి, కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు, గంటన్న దొర,మల్లు దొర,కోరన్న మల్లన్న, సోయంగులు కామయ్య,కాను ముర్ము, సిద్దు ముర్ము పోరాటాల స్ఫూర్తితో.. జల్, జంగల్, జమీన్, పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలు చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. విద్యా- వైద్యం- ఉపాధి – భూమి,అడవిపొడు భూములు – ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గిరిజన సంక్షే మం, ఐ టి డి ఎ ల పనితీరుపై చర్చిస్తున్నట్లు వారు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఆదివాసుల సమస్యలపై ఉద్యమ ప్రణాళిక ప్రకటించబోతున్నట్లు, గిరిజన ముసాయిదా తయారు చేయనున్నట్లు ప్రోగ్రాం కన్వీనర్ మాజీ జెడ్పిటీ సి గుండు శరత్ తెలిపారు.