తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణ స్థలం పరిశీలన

అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణ స్థలం పరిశీలన

మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని  ప్రభుత్వ ఐటిఐ లో టాటా టెక్నాలజీ లిమిటెడ్ వారు నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణం కోసం స్థలాన్ని టాటా కంపెనీ రిప్రెసెంటేటివ్ బసవరాజు బృందం బుధవారం పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీఐ లలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం తీసుకున్న నిర్ణయం లో భాగంగా ప్రభుత్వ ఐటిఐ లో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేయడానికి కావలసిన వసతుల గురించిచర్చించారు. రోజురోజుకు పెరుగుతున్న ఆధునిక సాంకేతికతను విద్యార్థులకు అందించాలని లక్ష్యంతో టాటా కంపెనీ తో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అందుకు కావలసిన స్థలం పర్యవేక్షించారు. ఏజెన్సీ విద్యార్థులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఐటిఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, మణుగూరు ఐటిఐ ప్రిన్సిపాల్ బి ప్రభాకర్, ట్రైనింగ్ అధికారి జి రవి, ఏటీఓ లు ఎం. శ్రీనివాసరావు, జీవీ కృష్ణారావు, నరసయ్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *