మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి ఏజెన్సీ గౌడులు వినతి
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి ఏజెన్సీ గౌడులు వినతి
పినపాక నియోజకవర్గం, శోధన న్యూస్ : ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ ఫలాలు అందక, ఇన్సూరెన్స్ వర్తించక కొట్టుమిట్టాడుతున్న గౌడన్న దుస్థితి పై మారుమూల ప్రాంతమైన పినపాక,కరకగూడెం, మణుగూరు గౌడ సంఘీయులు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కి వినతి పత్రాన్ని అందించారు . ఏజెన్సీ గ్రామాల ఆదిమ స్థిర నివాసులైన గౌడుల సమస్యలను గూర్చి 1950 -56 సంవత్సరంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 342 ఐదవ షెడ్యూల్ సవరించిన చట్టం 108/1977 జీవో నెంబర్ 58 సీరియల్ నెంబర్ 7 ప్రకారం అనగా ప్రస్తుత జీవో 5 ప్రకారం ఏజెన్సీ ఏరియా గౌడులు షెడ్యూల్ తెగ( ఎస్టి ) గా మన గౌరవ రాష్ట్రపతి గారి సంతకం పొందుపరచారన్నారు. గత కొంతకాలంగా పై అధికారులను మమ్ములను రెవిన్యూ ఎంక్వయిరీ ఇప్పించవలసిందిగా కోరుతూ ఏజెన్సీ గౌడ్ కి ఎస్టీ కుల ధ్రువీకరణ అందించాలని ఎంతో మంది అధికారులను వేడుకోవడం జరిగిందన్నారు. మా గోడును ఆలకించినటువంటి వారు లేరని ఏజెన్సీలో మమ్ములను చిన్న చూపు చూడడం వల్ల ప్రభుత్వం నుండి గౌడ్ అన్నకు అందే పథకాలు మేము అందుకోలేకపోతున్నాంఅని అన్నారు . చెట్టు పైనుండి పడితే భరోసా లేక పోయే, ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం ఇస్తున్న ఇన్సూరెన్స్ అందుకునే పరిస్థితిలో లేని దుస్థితిలో మేము బ్రతుకుతున్నామని మా యొక్క ఆర్థిక స్థితిగతులను ఆలోచించి మా పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నో ఏళ్లుగా మూలుగుతున్న ఏజెన్సీ గౌడ్ ల సమస్యను పరిష్కరించాలని మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ఆనాడు అసెంబ్లీలో ఏజెన్సీ గౌడులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి ఎస్టి కుల ధ్రువీకరణ పత్రమును ఇవ్వాలని కోరుతూ ఆనాడు గళం విప్పి మా సమస్యను ప్రస్తావించారు కాబట్టి నేడు మా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాం అన్నారు. ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఏజెన్సీలో కొట్టుమిట్టాడుతున్న గౌడుల బతుకులు మార్చుట కొరకు ఏజెన్సీలో నివసిస్తున్న ప్రతి ఒక్క గౌడన్నకు ఎస్టి కుల ధ్రువీకరణ పత్రము అందేలా కృషి చేయాలని కోరారు. ఏజెన్సీ గౌడ్ల సమస్య తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంత్రి కి సాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం గౌడ సంఘీయులు రావుల రవి గౌడ్, లీలా వాసు, చీకటి రామచంద్రయ్య, పినపాక మండల గోపాలరావు పేట గౌడ సంఘీయులు, కొంపెల్లి నాగేశ్వరరావు, కొంపెల్లి మల్లేష్ గౌడ్, చిర్ర కుమార్, జలగం కనకయ్య గౌడ్, జలగం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.