తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించిన ఏఐటియుసి నాయకులు 

రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించిన ఏఐటియుసి నాయకులు 

మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటియుసి) మణుగూరు బ్రాంచ్ నాయకత్వం  రైల్వే అండర్ బ్రిడ్జి  ప్రాంతాన్ని, పరిస్థితిని పరిశీలించారు. అలాగే  పీకేఓసి -2 సందర్శించి  కార్మికులను కలుసుకొని వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. వర్షాకాలంలో కార్మికులు ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వరదను దృష్టిలో పెట్టుకొని తగిన రక్షణచర్యలు తీసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాలని కోరారు.పీకేఓసి -2 లో అన్ని సెక్షన్లను సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా రోడ్లు మొత్తం బురదమయం అయిపోయి కార్మికులు నడవలేని పరిస్థితి ఉందని అన్నారు. 60 టన్నుల  డంపర్ పార్కింగ్ యార్డ్ కు రహదారి దయనీయంగా మారడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. మెయింటెనెన్స్, డోజర్, ఎస్ అండ్ డి సెక్షన్లలో పనిచేస్తున్న కార్మికులు రక్షణగా పని ప్రదేశాలకు వెళ్లే పరిస్థితి లేదని అన్నారు, ఈ సెక్షన్లలో కార్మికులు త్రాగడానికి మంచినీరు కూడా లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.

పీకేఓసి 2 లో ఉన్న ఆర్ఓ  వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ను పట్టించుకోకపోవడం వలన నీళ్లు సరిగా ఫిల్టర్ కావడం లేదని అన్నారు. వాషింగ్ ప్లాంట్ వద్ద వాడిన బురద నీరు సరి అయిన డ్రైనేజీ లేక ఎస్ అండ్ డి  షడ్ ముందర మొత్తం బురదతో నిండి పోయిందని అన్నారు. మెయింటెనెన్స్ సెక్షన్లో సత్వరమే రెస్ట్ షెల్టర్ ను ఏర్పాటు చేయాలని కోరారు. కేసీహెచ్ పి ట్రాక్ లైన్ పక్కన ఉన్న రహదారి వెంబడి వాహనాలు ప్రమాదం బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. కేసీహెచ్ పి  గుండా వెళ్లే రహదారి పరిస్థితి కూడా సరిగా లేదని, ఈ రహదారిని కూడా బాగు చేయాలని కోరారు. పీకే ఓ సి-2  క్యాంటీన్ నందు మెనూను పాటించడం లేదని అన్నారు.

అన్ని టిఫిన్లు కార్మికులకు అందేలా చర్యలు తీసుకొని క్వాంటిటీ, క్వాలిటీ పెంచాలని కోరారు.  రెస్ట్ రూమ్లలో అపరిశుభ్రత లేకుండా శుభ్రంగా ఉంచాలని కోరారు. సులబ్ కాంప్లెక్స్ లలో లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. పీకే ఓసి-2 వెళ్లే రహదారిలో స్ట్రీట్ లైటింగ్ సరిగాలేని కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. పై సమస్యలన్నింటినీ కార్మికులను అడిగి తెలుసుకున్న బ్రాంచ్ నాయకత్వం కంపెనీ కోసం అనుక్షణం కష్టించి పనిచేస్తున్న కార్మికుల కొరకు మేనేజ్మెంట్ వెంటనే యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారం కొరకు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ యూనియన్ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో బ్రాంచ్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ మేకల ఈశ్వర్, ఆఫీస్ బేరర్స్ ఆవుల నాగరాజు, ఆధార్ల సురేందర్, శనిగరపు కుమారస్వామి, పిట్ సెక్రటరీ కోడి రెక్కల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *