తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

అజ్మీరా సీతారాం నాయక్ మెజార్టీ తో గెలిపించాలి

అజ్మీరా సీతారాం నాయక్ మెజార్టీ తో గెలిపించాలి 

మణుగూరు, శోధన న్యూస్ : మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన సీతారామరాజు  విజ్ఞప్తి చేశారు. సీతారాం నాయక్  విజయాన్ని కాంక్షిస్తూ బిజెపి ఆధ్యర్యంలో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఇప్పల సింగారం, తిర్లపురం, రామానుజవరం, పగిడేరు తదితర గ్రామాలలో ఇంటింటి ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంపన సీతారామరాజు మాట్లాడుతూ..  గత పదేళ్లుగా కేంద్రంలో నరేంద్ర మోడి  నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా  ఉచిత గ్యాస్ కనెక్షన్లు, రైతులకు కిసాన్ సమ్మాన్ నిది ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు, ఉచిత రేషన్ ఆయుష్మన్ భారత్ హెల్త్ కార్డులు, అయోధ్య రామమందిరం, ఆర్టికల్ 370 రద్దు వంటి అనేక విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానీదే అన్నారు.  మరొక్కసారి బిజెపి ని గెలిపించుకోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించు కోవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు సోదే నవీన్ మునిగేలా శ్రీరామ్ జూపల్లి శ్రీను నాయకులు గంటా హరిప్రసాద్ దాచేపల్లి అశోక్ కంపెర్ల సాంబశివరావు మునిగేలా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *