పార్లమెంట్ ఎన్నికలకు అధికారులంతా సిద్దంగా ఉండాలి
పార్లమెంట్ ఎన్నికలకు అధికారులంతా సిద్దంగా ఉండాలి
– సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్
సంగారెడ్డి, శోధన న్యూస్ : రానున్న పార్లమెంట్ ఎన్నికలకు అధికారులంతా సిద్దంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ సూచించారు. క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా బుధవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం సంగారెడ్డిలో పోలీస్ అధికారులతో నెల వారి నేరసమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్ లో (అండర్ ఇన్వెస్టిగేషన్) ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, నేరస్తులను న్యాయస్థానం ముందు హాజరుపరచాలని ఎస్ హెచ్ఒ లకు సూచనలు చేశారు. ఎగ్జిక్యూషన్, మిస్సింగ్ కేసులలో ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ప్రతి కేసులో ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని,యూ ఐ కేసులు పరిమిత లిమిట్స్ లో ఉండాలని సూచించారు. వచ్చే నెల 9న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ నందు వీలైనన్నీ ఎక్కువ కేసులు పరిస్కారమయ్యే విధంగా చూడాలన్నారు. ఎస్ హెచ్ఒ లు తమ తమ ఏరియాలో సిసి కామెరాలు ఏర్పాటు చేసే విధంగా ఆయా గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ ను దృష్టిలో ఉంచుకొని పోలీస్ అధికారులు, సిబ్బంది 24గంటలు అందుబాటులో ఉండాలని, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి ఎన్నికల కమిషన్ ఆధీనంలో విధులు నిర్వహించవలసి ఉంటుందన్నారు. సిబ్బంది ఎవ్వరూ కూడా విధినిర్వాహణలో అలసత్వం చూపరాదని, పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల నియమావళిని తెలుసుకొని ఉండాలన్నారు. గత ఎన్నికలలో జరిగిన లోపాలను అధిగమించి, పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించుకునేల అధికారులు అందరు కృషి చేయాలన్నారు. స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్, ఇతర జిల్లాలతో సరిహద్దు చెక్ పోస్ట్ లతో పాటు ఎస్.హెచ్.ఓ లు తమ తమ ఏరియాలలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టి ఎలాంటి అక్రమ రవాణాకు తావులేకుండా చూడాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు.ఎస్పీ ఎ సంజీవ రావ్, సంగారెడ్డి డిఎస్పి సత్యయ్య గౌడ్, నారాయణఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి, పటాన్ చెర్వు డిఎ స్పి రవీందర్ రెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ బి రమేష్, ఎస్ బి ఇన్స్పెక్టర్ భాస్కర్, ఎలెక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, జిల్లా సిఐలు, ఎస్ఐలు, స్టేషన్ రైటర్స్ తదితరులు పాల్గొన్నారు.