తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

 అంబేడ్కర్ విగ్రహానికి గోపుర నిర్మాణం చేపట్టాలని  వినతి 

 అంబేడ్కర్ విగ్రహానికి గోపుర నిర్మాణం చేపట్టాలని  వినతి 

మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని  పీవీ కాలనీ అంబేడ్కర్ పార్క్ ఎదురుగా ప్రతిష్టించిన అంబేడ్కర్ కాంస్య విగ్రహ నాణ్యతా దెబ్బతినకుండా పిల్లర్లతో కూడిన గోపుర నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఏరియా టి బి జి కె యస్ బ్రాంచి ఉపాధ్యక్షులు నాగెల్లి సోమవారం ఏరియా ఎస్ఓటూ జిఎం శ్యామ్ సుందర్కి  వినతి పత్రాన్ని అందజేశారు.. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది భారత రాజ్యాంగ నిర్మాత గా పేరొందిన డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ గారు ప్రతి ఒక్కరికీ మార్గదర్శిగా నిలిచారని ఆయన ఆశయ సాధనలను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకొని భావి భారత సమాజ నిర్మాణానికి తోడ్పాటు అందించాలనే బలమైన లక్ష్యంతో 2016 సంవత్సరంలో ఏరియా యస్. సి, యస్ టి ఉద్యోగుల విరాళాలతో అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగిందని ఆయన తెలిపారు. ఏంతో శ్రమ, భారీ ఖర్చు నడుమ యస్. సి, యస్ టి ఉద్యోగులు సమన్వయంతో నిర్మించిన విగ్రహం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ విగ్రహ నాణ్యతా పూర్తిగా దెబ్బతింటుందని అయన తెలిపారు..ఏరియాలోని గుడులకు, ప్రభుత్వ బడులకు, కళాశాలలకు,ప్రభుత్వ ఆసుపత్రులకు అడిగిందే తడవుగా ఏదొ సహాయం అందించే యాజమాన్యం అంబేడ్కర్ విగ్రహానికి గోపుర నిర్మాణంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన వినతి పత్రం రూపంలో అందించారు… ఈ కార్యక్రమంలో బంగారి పవన్ కుమార్, మునిగేల నాగేశ్వర రావు, యెర్రాపు వినయ్ కుమార్, ముకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *