తెలంగాణబూర్గంపాడుభద్రాద్రి కొత్తగూడెం

చీమల యాదవ్ కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం

చీమల యాదవ్ కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం

బూర్గంపాడు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  బూర్గంపాడు మండలంలోనీ ఇరవెండి గ్రామంలో గల వేణుగోపాల స్వామి ఆలయం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని యాదవ కుటుంబాలలో భాగమైన చీమల ఇంటి పేరుతో ఉన్న 24 కుటుంబాలు అంతా ఒకచోట చేరి ఆత్మీయ సమ్మేళనాన్ని చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో కుటుంబ విలువలు కుటుంబ సంబంధాలు దూరం అవుతున్న ఈ నేపథ్యంలో ఇలాంటి సమ్మేళనాన్ని నిర్వహించుకొని ప్రతి ఒక్కరికి ఒకరి ఒకరు సాయంగా ఉండాలని కలిసిమెలిసి ఉండాలని మిగతా అన్ని కుటుంబాలకు ఆదర్శంగా ఉండాలని ఇలాంటి సమ్మేళనాలు మరిన్ని ప్రతి సంవత్సరం చేసుకోవాలని మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమం లో  మణుగూరు నుండి  చీమల శ్రీనివాస్, చీమల లింగయ్య, చీమల లింగరాజు, చీమల సతీష్, చీమల కొమరయ్య, చీమల విష్ణు, చీమల రమేష్ చీమల లింగన్న, చీమల రమేష్, చీమల మల్లేష్, చీమల రామకృష్ణ, చీమల సురేష్, అశ్వాపురం నుండి చీమల వెంకటేశ్వర్లు, చీమల శ్రీను, చీమల వీరన్న, చీమల రమేష్, చీమల శీను, చీమల సతీష్, పాండురంగాపురం నుండి చీమల వెంకటనారాయణ, చీమల నరసింహారావు, గరిపేట నుండి చీమల లింగస్వామి, చీమల సతీష్, చీమల రమేష్, ఒంటిగుడిసె నుండి చీమల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *