పూర్వ విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం
పూర్వ విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం
చిత్తలూరు, మే 4 శోధన న్యూస్ :
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు గ్రామంలో గల జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2004-2005 విద్యాసంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనమయ్యారు. ఈ సమ్మేళనానికి ఆనాటి పాఠశాల గురువులు హాజరై మాట్లాడారు. 20 సంవత్సరాల విద్యార్ధులు ఉన్నతస్థాయిలో ఎదగడం గర్వకారణమని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్క విద్యార్ధికి పూర్వ విద్యార్థులు మార్గదర్శకం కావాలన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు వారు పని చేస్తున్న రంగాలను వివరిస్తూ.. విద్యార్ధి దశలో వారు చేసిన విద్యాభ్యాసం, జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం విద్య నేర్పిన గురువులను పూర్వ విద్యార్ధులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పూర్వపు విద్యార్ధులు పాల్గొన్నారు.