అంకమ్మ తల్లి తిరునాళ్ళ గోడ పత్రికలను ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్
అంకమ్మ తల్లి తిరునాళ్ళ గోడ పత్రికలను ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్
భద్రాచలం, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను ఆలయ అభివృద్ధి ప్రదాత, హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణ వ్యవస్థాపకులు మారగాని శ్రీనివాసరావు భద్రాచలంలోని ఐటిసి అతిధి గృహంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి అంకమ్మ తల్లి తిరునాళ్లకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆహ్వాన గోడ పత్రికను ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో వేచ్చేసి ఉన్న శ్రీ శ్రీ అంకమ్మ తల్లి తిరునాళ్ళ ఈనెల 18 అర్ధరాత్రి నుండి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతుందని, ఆలయ సందర్శానికి జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని తెలిపారు. అనంతరం దేవాలయ ప్రాముఖ్యతను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ అభివృద్ధికి సహకరిస్తానన్నారు.