తెలంగాణపినపాక నియోజకవర్గంభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

మున్సిపల్ కార్మికులకు ఏరియర్స్ చెల్లించాలి

మున్సిపల్ కార్మికులకు ఏరియర్స్   చెల్లించాలి

  • ఇఫ్టూ జిల్లా అధ్యక్షులు  మధుసూధన్ రెడ్డి

మణుగూరు, శోధన న్యూస్ :  మున్సిపల్ కార్మికులకు  ఏరియర్స్ ను చెల్లించాలని ఇఫ్టూ జిల్లా అధ్యక్షులు ఆర్ మధుసూధన్ రెడ్డి మున్సిపల్ అధికారులను కోరారు. మంగళవారం మున్సిపల్ కార్మికుల ఏరియర్స్ విషయమై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు  ని కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి ఆర్ సి నివేదిక ప్రకారం అన్ స్కిల్డ్ కార్మికులకు రూ.15,600, సెమీస్కిల్డ్ కార్మికులకు రూ.19,500, స్కిల్డ్ కార్మికులకు రూ.22,750లు 2021 జూన్ నుండి అమలు కావలసి ఉండగా.. 2023 మే నుండి మణుగూరు మున్సిపల్ కార్మికులకు అమలు చేశారని అన్నారు. సుమారుగా రెండు సంవత్సరాల ఏరియర్స్ మున్సిపల్ కార్మికులకు రావాల్సి ఉందన్నారు. ఈ విషయం గురించి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడగా నిధుల కొరత వలన గతంలో ప్రతినెల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉండేదని, దానిని అధిగమించి కార్మికుల జీతాలు ప్రతినెల చెల్లిస్తున్నామని, ఏరియర్స్ కూడా నిధుల వెసులుబాటు చూసుకొని తప్పకుండా చెల్లిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం వీలైనంత త్వరగా ఏరియర్స్ చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ మణుగూరు ఏరియా కార్యదర్శి బి మల్సూర్, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం రాజేందర్, పీ లక్ష్మీనారాయణ, ఆర్ వెంకటేశ్వర్లు, పి నరసింహారావు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *