స్టాటిక్ సర్వలెన్స్ టీం పనితీరును పరిశీలించిన ఏఎస్పీ
స్టాటిక్ సర్వలెన్స్ టీం పనితీరును పరిశీలించిన ఏఎస్పీ
భద్రాచలం, శోధన న్యూస్ : భద్రాచలం కూనవరం రోడ్డులో ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర స్టాటిక్ సర్వలెన్స్ టీం( ఎస్ఎస్ టి ) పనితీరును భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం పరిశీలించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లాలో ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న ప్రాంతాల్లో చెక్పోస్టులను , ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న భద్రాచలం,కూనవరం రోడ్డులో ఏర్పాటు చేసిన ఎస్ఎస్ టి బృందం పనితీరును భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగు సూచనలు చేశారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు,సిబ్బంది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అక్రమంగా డబ్బు, మద్యం రవాణా చేస్తూ ఎవరైనా పట్టుబడితే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అక్రమ మద్యం,నగదు రవాణా గురించి ప్రజలకు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.