పోలీస్ శాఖలో నిరుపయోగ వస్తువుల వేలం
పోలీస్ శాఖలో నిరుపయోగ వస్తువుల వేలం
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖలోని వివిధ విభాగాలలో ఉపయోగించి ప్రస్తుతం నిరుపయోగకరంగా మారిన వస్తువులను 26.03.2024 నా ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం నందు వేలం ద్వారా విక్రయించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్ ,ఐరన్ స్క్రాప్,కుట్టు మిషన్,పాత టైప్ మెషిన్స్ మరియు ఇతర వస్తువులకు వేలంపాట నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఇట్టి వేలంపాట నందు ఆసక్తి గల వారు తమ ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు ఒక జిరాక్స్ కాపీ తీసుకొని ఆర్ఐ అడ్మిన్ రవి (8712682143) సంప్రదించాలని తెలిపారు.