జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వాహానాల వేలం
జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వాహానాల వేలం
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన, అన్ క్లెయిమ్డ్ వాహనాలకు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వేలంపాట నిర్వహించారు. మొత్తం 323 వాహనాలకు అన్ని జిల్లాల నుండి వేలంపాటలో పాల్గొనడానికి అధిక సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు.ఇందులో 306 ద్విచక్ర వాహనాలు మరియు 17 కార్లు, ఆటో లకు గురువారం వేలంపాట నిర్వహించడం జరిగిందని ఎంటిఓ సుధాకర్ తెలిపారు. ఈ వేలంపాట ద్వారా సేకరించిన రూ .15,04,000 నగదును ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ వేలంపాట నియమిత కమిటీ ఆధ్వర్యంలో జరిగిందన్నారు. కమిటీ చైర్మన్ గా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఈ వేలంపాటకు నోడల్ అధికారిగా డిఎస్పీ మల్లయ్య స్వామిని,సభ్యులుగా కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,ఎంటిఓ సుధాకర్ మరియు అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు లను నియమించారు.