బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
అశ్వాపురం,శోధన న్యూస్: కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ది పొరిక బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మండల పార్టీ అద్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య కోరారు. మండల కాంగ్రెస్ కార్యాలయంలో మండల అద్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా ఎంపీపీ ముత్తినేని సుజాత, సీపీఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్, టిడిపి మండల అధ్యక్షుడు తుళ్ళూరి ప్రకాష్ , సిపిఎం తరపున మండెపూడి సాంబశివరావు, టిజెఎస్ మండల బాద్యులు పగడాల కరుణాకర్ రెడ్డి, సురకంటి ప్రభాకర్ రెడ్డిలు పాల్గొన్నారు.ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య మాట్లాడుతూ.. ఈ నెల 13 వ తేదీ జరగబోవు పార్లమెంటు ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థి బలరాం నాయక్ ని గెలిపించే ఆవశ్యకతను తెలుపుతూ ఈ ఎన్నికలలో బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు అశ్వాపురం మండల నాయకులు కృషి చెయ్యాలన్నారు. గురువారం 10.00 గంటలకు జరుగు సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లాకు ఆప్షన్స్ సభ్యులు ఎండి షరీఫుద్దీన్, గొల్లగూడెం ఎంపీటీసీ ఏనిక రవి, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, బచ్చు వెంకటరమణ,ఓరుగంటి రమేష్ బాబు, బట్టా సత్యనారాయణ, లంకెమళ్ళ కొండలరావు, చెంచల రాము, రాయపూడి రాజేష్, గొల్లపల్లి నరేష్ కుమార్, మట్టా భద్రారెడ్డి, సదర్లాల్, కురం నరసింహా రావు, మోర్వీనేని చంద్రకళ, కోలా శశికాంత్,ఇరుగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.