బ్యాంకర్లు నిర్దేశి రుణ లక్ష్యాలను పూర్తిచేయాలి -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
బ్యాంకర్లు నిర్దేశి రుణ లక్ష్యాలను పూర్తిచేయాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : బ్యాంకర్లు నిర్దేశించిన విధంగా రుణ లక్ష్యాలను పూర్తిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యాల పురోగతిపై జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రుణ లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. రుణ లక్ష్యాలకు సంబంధించిన వివరాలపై బ్యాంకర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోమొత్తం 5599.03 కోట్ల రుణ లక్ష్యం కాగా, అందులో ఇప్పటివరకు రూ 4175.83 కోట్లు మంజూరు చేసినట్టు అధికారులు ఆమెకు తెలిపారు. అందులో వ్యవసాయనికి రూ 4309.54 కోట్లకు గాను రూ 1923.91కోట్లు,స్మాల్ స్కేల్ పరిశ్రమ లకు రూ 426.55 కోట్లకు గాను రూ 377.32కోట్లు, విద్యారంగానికి రూ 202.80 కోట్లకు గాను రూ 7.45 కోట్లు, గృహ నిర్మాణానికి రూ 536.22 కోట్లకు గాను రూ 12.26 కోట్లు, ఇతర మౌలిక వసతులకు రూ 50.02 కోట్లకు గాను రూ 91.65 మొత్తం ఇప్పటివరకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. బ్యాంకర్లు వివిధ ప్రభుత్వ పధకాల ను ప్రజలకు చేరువ చేస్తూ త్వరితగతిన లక్ష్యాలను పూర్తి చేయాలని బ్యాంకర్లకు ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఏ పి డి విద్యా చందన, ఎల్దిఎం రామిరెడ్డి, నాబార్డు డీడీఎం సుజిత్,పరిశ్రమల శాఖ అధికారి తిరుపతయ్య, బ్యాంకుల రీజనల్ మేనేజర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.