తెలంగాణభద్రాచలంభద్రాద్రి కొత్తగూడెం

లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు

లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు

భద్రాచలం, శోధన న్యూస్ : నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన  మిలీషియా కమాండర్, డిఎకేఎంఎస్  అధ్యక్షురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఎదుట స్వచ్చందంగా లొంగిపోయినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం లో లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుల వివరాలను వెల్లడించారు. సుక్మా జిల్లా జిల్లా,నెమలగూడ గ్రామం కిష్టారం పిఎస్ కు చెందిన నిషేధిత మావోయిస్ట్ పార్టీమిలీషియా కమాండర్  పోడియం ఇడుమయ్య అలియాస్  హరీష్, డిఎకేఎంఎస్  అధ్యక్షురాలు ఉయికే ముత్యాలక్క లు లొంగిపోయిన వారిలో ఉన్నారన్నారు. నిషేధిత సిపిఐ  మావోయిస్ట్ పార్టీకి చెందిన నాయకులు , దళసభ్యులు ఆదివాసీ ప్రజలను బెదిరిస్తూ,ఆదివాసీ యువతీ యువకులను,మైనర్ బాలబాలికలను మిలీషియాలో మరియు దళాల్లో బలవంతంగా చేర్చుతూ,ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అన్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గాని సహకరించవద్దు.మావోయిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడి మీ హక్కులను కాపాడుకోవాలని,అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆదివాసీ గ్రామాల ప్రజలను ఏఎస్పీ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్‌పి  చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై గత కొంతకాలం నుండి సి‌పి‌ఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, దళ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ఎదుట స్వచ్చందంగా లొంగిపోతున్నారన్నారు. ఇప్పటికే అనేకమంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ నాయకులు,సభ్యులు తమ పార్టీ ప్రజలలో ఆదరణ కోల్పోయిందని గ్రహించి ఈ సిద్ధంతాలు విజయం సాదించలేవని తెలుసుకొని,ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని అనేకమంది పోలీసు వారి సమక్షంలో లొంగిపోవడం జరుగుతోందన్నారు. మావోయిస్టు పార్టీ నుండి బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునేవారు స్వచ్ఛందంగా గానీ, బంధుమిత్రుల ద్వారా గాని తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో గాని లేదా జిల్లా పోలీసు ఉన్నతాధికారులను గానీ సంప్రదించాలని ఏఎస్పి జిల్లా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *