అశ్వాపురంతెలంగాణపినపాక నియోజకవర్గంభద్రాద్రి కొత్తగూడెం

సీజనల్ వ్యాధులు ప్రబల కుండా అప్రమత్తంగా ఉండాలి 

సీజనల్ వ్యాధులు ప్రబల కుండా అప్రమత్తంగా ఉండాలి 

-భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ 

పినపాక నియోజకవర్గం, శోధన న్యూస్ : వర్షాకాలం ప్రారంభమైనందున ఆదివాసి గిరిజన గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబల కుండా  వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ,  గిరిజనులకు వైద్య సేవలు అందించాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం  అశ్వాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం  ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని డ్రగ్స్టోర్, లాబరేటరీ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులను వైద్య చికిత్సలు సక్రమంగా అందుకున్నవది, లేనిది తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ మారుమూల అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసి గిరిజన కుటుంబాలకు వైద్య సిబ్బంది మరియు వైద్యాధికారులు తాము పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్థానికంగా ఉంటూ 24 గంటలు గిరిజనులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల పట్ల ముఖ్యంగా గర్భిణీ స్త్రీల పట్ల మర్యాదపూర్వకంగా ఉంటూ వారికి సరియైన వైద్యం అందించాలని అన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల ఓపి రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాలని, అలాగే గిరిజన గ్రామాలలో నూతనంగా ప్రబులుతున్న తరుణ మరియు సికిల్ సెల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించాలని, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని అన్నారు. ఎలాంటి జ్వరమైన రక్త పూతలు సేకరించి మలేరియా ఉన్నట్లయితే పూర్తి చికిత్స అందించి మిగతా వ్యాధుల కోసం టీ హబ్ కి రక్త నమూనాలు పంపించి రిపోర్టులు వచ్చాక పూర్తి చికిత్స అందే విధంగా గిరిజనులకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. పి హెచ్ సి లో తగినన్ని మందులు అన్ని వ్యాధులకు సంబంధించినవి అందుబాటులో ఉంచుకోవాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం ఆశా వర్కర్ల తో మాట్లాడుతూ మీ పరిధిలోని గ్రామాలలోని గిరిజనులకు వర్షాకాలంలో ఇంటిముందు బయట నీరు నిలువ ఉండకుండా చూసే విధంగా గిరిజనులకు తెలియజేయాలని, పాత టైర్లు గాని కూలర్లు కానీ ఉంటే తీసి వేయించాలని ఆయన అన్నారు. అనంతరం వెటర్నరీ హాస్పిటల్ ను సందర్శించి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వెటర్నరీ అసిస్టెంట్కు అనితకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం మణుగూరు లోని గొల్లగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణకు 800 ఎకరాల భూమికి సంబంధించి ఎల్ఏఓ, ఎస్ డి సి సుమ ఆధ్వర్యంలో గ్రామంలోని రైతులతో జరుగుతున్న పీసా గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి అశ్వాపురం తాసిల్దార్ స్వర్ణ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *