బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులను సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలి
బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులను సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలి
మణుగూరు, శోధన న్యూస్: సింగరేణి వ్యాప్తంగా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో పనిచేస్తున్న బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులను సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలని, వేతన పెంపుకు చర్యలు చేపట్టాలని, సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు సిఎంపిఎఫ్ జమ వివరాల లెక్కలు చూపాలని కోరుతూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి సివిల్ జిఎం టి సూర్యనారాయణ కి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో వినతి పత్రం అందజేసినట్లు ఇఫ్టూ నాయకులు అంగోత్ మంగీలాల్ తెలిపారు. ఈ సందర్భంగా మంగీలాల్ మాట్లాడుతూ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో పనిచేస్తున్న బెల్ట్ క్లీనింగ్ ప్రక్రియ నైపుణ్యతతో కూడినదని, యాజమాన్యం సానుకూలంగా స్పందించి బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులను సెమి స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలని కోరారు. అల్లాగే సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 2024 మార్చి 31 వరకు సీఎం పిఎఫ్ లెక్కలను చూపాలని కోరారు. ప్రమాదవశాత్తు ఎవరైనా కాంట్రాక్ట్ కార్మికులు గాయాల పాలైతే వారికి మెరుగైన వైద్యంతో పాటు వారు కోలుకుని తిరిగి విధులకు హాజరయ్యేంతవరకు వారిని కంపెనీ ఆదుకోవాలని, ప్రతి నెల 7వ తేదీ కల్లా కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు యాజమాన్యమే నేరుగా చెల్లించే విధంగా తగు చర్యలు చేపట్టాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గోదావరి లోయ బొగ్గు గది కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.