తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

సైబర్ బాధితులకు అందుబాటులోకి మెరుగైన సేవలు

సైబర్ బాధితులకు అందుబాటులోకి మెరుగైన సేవలు

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: సైబర్ బాధితుల కోసం  మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి రోహిత్ రాజు  తెలిపారు. భద్రాద్రి కోత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు  సైబర్ నేరాల కట్టడికి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ నేరాల పట్ల ప్రత్యేక శిక్షణను పొంది సైబర్ వారియర్స్ గా నియమింపబడిన సిబ్బందికి ఫోన్లు మరియు సిమ్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక్కో సైబర్ వారియర్ చొప్పున 28 మందిని నియమించడం జరిగిందని తెలిపారు.సైబర్ వారియర్స్ గా శిక్షణ పొంది పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ ఉంటుందని తెలియజేసారు.సైబర్ నేరాల బారిన పడిన ప్రజలు వెంటనే 1930 కి కాల్ చేయడం గానీ,NCRP పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం గానీ చేయాలన్నారు.బాధితులు ఫిర్యాదులను నమోదు చేసుకుంటేనే గుర్తించడం సులువవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.సైబర్ నేరాలకు గురైన బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకే సైబర్ వారియర్స్ ను పోలీస్ శాఖ తరపున ప్రతి పోలీస్ స్టేషన్లో నియమించడం జరిగిందని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడిన ఫిర్యాదు చేసిన బాధితుడికి సంబంధిత పోలీస్ స్టేషన్లో నియమింపబడిన సైబర్ వారియర్ ద్వారా తమ అప్లికేషన్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలియజేసారు.కావున జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *