పేద కుటుంబానికి భరోసా వెల్ఫేర్ సొసైటీ సహాయం
పేద కుటుంబానికి భరోసా వెల్ఫేర్ సొసైటీ సహాయం
మణుగూరు, శోధన న్యూస్ : భరోసా వెల్ఫేర్ సొసైటీ కమిటీ పేద కుటుంబాలకు అండగా ఉంటుందని సొసైటీ గౌరవ అధ్యక్షులు లింగబాబు, అధ్యక్షులు ఎండి అమినుద్దీన్ అన్నారు మంగళవారం సమితి సింగారంలోని విద్యానగర్ కాలనీ లోని మడిపేద్ది నాగేష్ కుటుంబానికి ఇల్లు కూడా సరిగా లేని కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబానికి 6000 రూపాయల విలువగల బియ్యం, నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. భరోసా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు దాతలు ఇజ్జాల రవికుమార్, సుదీప్తి దంపతుల సహకారంతో భరోసా వెల్ఫేర్ సొసైటీ కమిటీ వారి ఆధ్వర్యంలో అందించడం జరిగింది. అలాగే ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆరుట్ల సురేష్ బాబు కుటుంబానికి కూడా బియ్యం, నిత్యావసర సరుకులు భరోసా కమిటీ వారు అందించారు. బాధితుల కుటుంబ సభ్యులు భరోసా వెల్ఫేర్ సొసైటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు భరత్ తదితరులు పాల్గొన్నారు.