దామెర గ్రామంలో శివాజీ విగ్రహ ప్రతిష్ఠ కు భూమి పూజ.
దామెర గ్రామంలో శివాజీ విగ్రహ ప్రతిష్ఠ కు భూమి పూజ.
హన్మకొండ ,శోధన న్యూస్: ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అర్ కుల సంఘం నాయకులు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా విగ్రహ కమిటీ చైర్మన్ మోరె బాపురావు మాట్లాడుతూ అరేకుల సంఘం ఇష్టదైవంగా భావించే ఛత్రపతి శివాజీ విగ్రహం దామెర గ్రామంలో ఏర్పాటు చేయడానికి భూమిపూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు.విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి భూమి ని మోరె రవి,మోరె బాపురావు ఇచ్చినందుకు అర్ కుల సంఘం దామెర గ్రామ అధ్యకుడు ఇరువాల మల్లయ్య కుల సంఘం తరపునుండి కృతజ్ఞతలు తెలిపారు.