ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మ నిచ్చేది రక్తదానం మాత్రమే
ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మ నిచ్చేది రక్తదానం మాత్రమే
- ఎస్ఐ రాజేందర్.
- రక్తదానానికి విశేష స్పందన
- రక్తం దానం చేసిన 40 మంది రక్త దాతలు
- మెగా రక్తదాన శిబిరం విజయవంతం.
కరకగూడెం, శోధన న్యూస్: ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మ నిచ్చేది రక్తదానం మాత్రమే కరకగూడెం ఎస్ఐ రాజేందర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంపోలీస్ శాఖ బట్టుపల్లి గ్రామం,మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు ,తల సేమియా, సికేల్ సెల్ అనీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం బట్టుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రక్తదాన శిబిరాన్ని ఎస్ఐ రాజేందర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్ఐ ఏ.రాజేందర్ మాట్లాడుతూ. ఈ సమాజంలో తల సేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు సరియైన సమయంలో రక్తం దొరకక ఇబ్బంది పడుతున్న సమయంలో మీరందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి అండగా నిలిచారు అని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మ నిచ్చే ఏకైక గొప్ప దానం రక్తదానం అని అన్నారు.రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుకు కృషి చేసి, విజయవంతం చేసినందుకు యగ్గడి.భాస్కర్ , ఇల్లందుల సురేష్ లను శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ మారుముల ప్రాంతంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనయం అని అన్నారు.రక్తదాన శిబిరం నిర్వాహకులు యగ్గడి.భాస్కర్,ఇల్లందుల.సురేష్, కొప్పుల.మురళి మాట్లాడుతూ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, పత్రికా మిత్రులు, యువకులు, ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని వారన్నారు. అడగగానే స్పందించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి రక్తాదాతకు కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో 40 మంది రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు అని తెలిపారు.