ఆత్మహత్యకు ప్రయత్నించిన వృద్ధురాలిని కాపాడిన బ్లుకోల్ట్స్ పోలీసులు
ఆత్మహత్యకు ప్రయత్నించిన వృద్ధురాలిని కాపాడిన బ్లుకోల్ట్స్ పోలీసులు
భద్రాచలం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి నది స్నానగట్టాల వద్ద గోదావరి నదిలో దిగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వృద్ధురాలిని భద్రాచలం బ్లూ కోల్ట్స్ సిబ్బంది కాపాడారు. కొత్తగూడెంలోని రామవరం కాలనీకి చెందిన భారతి అనే వృద్ధురాలు కడుపునొప్పితో బాధపడుతూ తన పిల్లలను ఇబ్బంది పెట్టలేక ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రయత్నించింది.ఆత్మహత్యకు ప్రయత్నించిన వృద్ధురాలిని కాపాడి చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన బ్లూ కోల్ట్స్ పోలీసు కానిస్టేబుల్ అధికారులు సురేంద్ర మరియు జంపయ్యలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.