ఎండిపోయిన వారి పంటలను పరిశీలించిన బోయినపల్లి వినోద్ కుమార్
ఎండిపోయిన వారి పంటలను పరిశీలించిన బోయినపల్లి వినోద్ కుమార్
హనుమకొండ ,శోధన న్యూస్: ఎల్కతుర్తి మండలం గోపాలపురం గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. హుస్నాబాద్ మాజీ శాసనసభ సభ్యులు వోడితల సతీష్ కుమార్ హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మొగిలి. కిషన్ రావు. ప్రసాద్. సంపత్ రావు. వీరస్వామి. ల పొలాలను చూసి వినోద్ కుమార్ మాట్లాడుతూ ..బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని అన్నారు రైతుల కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో దేవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులు కుంటలు నింపి ప్రతి ఎకరాకు నీరు అందించేవారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి 200 ఎకరాలు పంట ఎండిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల గారడి తోటి అధికారంలోకి వచ్చి మీము అధికారంలోకి వస్తే క్వింటాల్ వరి ధాన్యానికి 500 బోనాస్ ఇస్తామని మాయమాటలు చెప్పి రైతులను నమ్మించిందని అన్నారు . అందరికీ పంట పెట్టుబడి సాయం కూడా అందించలేదని ధ్వజమెత్తారు. మీరు రెండు లక్షల రూపాయలు రుణాలు తీసుకోండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తాము అని మాయమాటలు చెప్పి రైతులను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం రైతులకు సాగు నీరు ఇవ్వలేని దుస్థితి లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ మాట్లాడుతూ ..దేవాదుల ప్రాజెక్టు నుండి నీరు తీసుకువచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానమని మండిపడ్డారు. కాంగ్రెస్ ను నమ్మి ప్రజలు ఓటు వేస్తే చివరికి వేసిన వారికి వెన్నుపోటు పొడిచిందని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది రైతులు ఎవరు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్. సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్. రైల్వే బోర్డు సభ్యులు యేల్తూరీ స్వామి. ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కడారి రాజు. స్థానిక ఎంపిటిసి యశోద రాజేశ్వరరావు. మండల యూత్ అధ్యక్షులు* *కొమ్మిడి మహిపాల్ రెడ్డి. సోషల్ మీడియా మండల అధ్యక్షులు గుండేటి సతీష్ నేత. సీనియర్ నాయకులు గుండా ప్రతాపరెడ్డి. దేవేందర్రావు. నాగేశ్వర్.రాజు మాధవరావు. రాజేశ్వరరావు. సమ్మయ్య.శివాజీ.మదర్.రాజ్ కుమార్. రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్. యూత్ నాయకులు కృష్ణ సాయి. స్వామి రావు. కార్తీక్ . సాంబరాజు.అనిల్ రంజిత్ కుమార్.గణేష్.రైతులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.