పొరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా ప్రచారం
పొరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా ప్రచారం
అశ్వాపురం, శోధన న్యూస్: పాములపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరిగంటి బిక్షమయ్య ఆధ్వర్యంలో మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా ఉపాధి హామీ పథకం చేపట్టిన పని ప్రదేశాలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను వివరించారు. అశ్వాపురం మండల కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో సిపిఐ,సిపిఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ… బిజెపి ప్రభుత్వం రైతులకు ప్రజలకు చేసిన న్యాయమేమీ లేదని మత రాజకీయాలను ప్రోత్సహిస్తూ, హిందువుల ముస్లిం, మరియు క్రిస్టియన్స్ మధ్య విభేదాలు తెచ్చే పార్టీ, బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తానని, ముస్లిమ్స్ కు రిజర్వేషన్ తీసేస్తానని చెబుతుంది వీటన్నిటిని రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలకు బడుగు బలహీన వర్గాలకు చేయూతనిచ్చేది కాంగ్రెస్, కాబట్టి ఇండియా కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ హస్తం గుర్తు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ఇండియా కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్తినేని సుజాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదకేశవరెడ్డి, ఓరిగంటి రమేష్ బాబు, బానోత్ సదర్ లాల్, మట్ట వీరభద్రారెడ్డి, వలబోజు మురళి, గొల్లపల్లి నరేష్ కుమార్, బైగాని శివ గౌడ్, కోలా శశికాంత్, పాములపల్లి నాయకులు గాదె వెంకట్ రెడ్డి, బట్ట సత్యనారాయణ, లోడిగా నరసింహారావు, భాస్కర్,రాజు సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్, సిపిఎం నాయకులు మండిపూడి సాంబశివరావు, పాయం నరసింహారావు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.