తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపై చీటింగ్ కేసులు

నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలపై చీటింగ్ కేసులు

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ గారి సూచనలతో జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలను సీజ్ చేసి అట్టి వాహనదారులపై చీటింగ్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై నరేష్ తెలిపారు. కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.ఇందులో భాగంగా కొత్తగూడెం వన్ టౌన్,టూటౌన్,3టౌన్, చుంచుపల్లి,లక్ష్మిదేవిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడుపుతూ పట్టుబడిన వారిపై చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.దొంగతనాలు,చైన్ స్నాచింగ్ లకు పాల్పడే నేరస్తులు నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను ఉపయోగిస్తున్నారని,అట్టి నేరాల నియంత్రణ,చేధన కొరకు ఈ విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు.కొత్తగూడెం పట్టణంలో నెంబర్ ప్లేట్లు లేకుండా గానీ,నెంబర్ ప్లేట్లు టాంపర్ చేసి గానీ ఎవరైనా పట్టుబడితే వారిపై చీటింగ్ కేసులను నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.నేరాల నియంత్రణకు పోలీసు వారు చేపడుతున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.కావున ప్రజలంతా తమ వాహనాలకు నెంబర్ ప్లేట్లు సరైన పద్ధతిలో ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *