చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ
చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ
ఇల్లందు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద గల చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అక్రమంగా నగదు,మద్యం రవాణాను అరికట్టడానికి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు.