బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలుగా చిర్రా సరస్వతి
బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలుగా చిర్రా సరస్వతి
మణుగూరు, శోధన న్యూస్: భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా మణుగూరు మండలానికి చెందిన చిర్రా సరస్వతి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గా రెండవసారి నియామక మైనందుకు సంతోషంగా ఉందన్నారు. నాపై నమ్మకం ఉంచి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా నియవి ఎంచినందుకు జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర నాయకత్వానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పెద్ద సంఖ్యలో మహిళలను పార్టీ వైపు ఆకర్షితులయ్యే విధంగా పనిచేస్తానని, పార్టీ అభివృద్ధికి, రాబోయే ఎన్నికల్లో మహబూబాద్ ఎంపీ అభ్యర్థి గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.