11 న సీఎం రేవంత్ రెడ్డి మణుగూరు పర్యటన
11 న సీఎం రేవంత్ రెడ్డి మణుగూరు పర్యటన
-సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 11 వ తేదీన పినపాక నియోజకవర్గం మణుగూరు పర్యటన నేపధ్యం లో మండలంలోని ముత్యాలమ్మనగర్ గ్రామపంచాయితీ ప్రభుత్వ ఐటిఐ కళాశాల సమీపాన సభాస్థలి, పార్కింగ్ ప్లేస్, హెలిప్యాడ్ ఏర్పాటు స్థలాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు డీఎస్పీ వంగ రవీంధర్రెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పినపాక నియోజకవర్గం మణుగూరులో ప్రారంభించేందుకు విచ్చేయుచున్నారన్నారు. తొలుత బహిరంగ సభ కోసం బూర్గంపాడును ఎంపిక చేసుకున్నట్లు, కొన్ని కారణాల వల్ల బహిరంగ సభను మణుగూరుకు మార్చడం జరిగిందన్నారు. సీఎం పర్యటనకు ఇంకా రెండు రోజులే ఉన్నందున ఏర్పాటు పనులను యుద్దప్రాతిపదికన త్వరితగతని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, వైస్ఎంపిపి కరివేద వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు సామా శ్రీనివాస్ డ్డి, పుచ్చకాయల శంకర్, తరుణ్డ్డి, సుబ్బారెడ్డి, దొబ్బల వెంకటప్పయ్య, వెంకట్రెడ్డి, కోటేశ్వరరావు, సీఐ సతీష్ కుమార్, ఆర్ండ్బిశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.