సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
-రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
-ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ..
-రుణమాఫీతో రైతులకు ఎంతో మేలు..
మణుగూరు, శోధన న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులకు 2 లక్షలు రుణమాఫీ ప్రకటించిన సందర్బంగా పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రం లో అంబేద్కర్ సెంటర్లో టిపీసీసీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంతరెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు కాల్చి మిఠాయి పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారనీ, రుణమాఫీ రైతులకు ఎంతో మేలు అని అన్నారు. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 మధ్య ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది అని అన్నారు. ఆగస్టు 15, 2024 లోపు 48 లక్షల మంది రైతుల యొక్క రుణాలను సుమారు రూ31 వేల కోట్ల తో రుణమాఫీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అదేవిధంగా సన్నాలకు రూ.500 బోనస్ ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మణుగూరు మండల రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శివ సైదులు, ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు కూరపాటీ సౌజన్య, మాజీ సర్పంచ్ వెంకటప్పయ్య,మాజీ ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్,సాంబ శివరావు, సత్యనారాయణ, గాండ్ల సురేష్, సమా శ్రీనివాసరెడ్డి,కుర్రం రవి పాతూరి వెంకన్న, మనసా, సుజాత, స్వరూప, వరలక్ష్మి,నాగేశ్వరరావు,చింతల కృష్ణ,జీవి, ఏఎంసి చారి, రాములు,కాంగ్రెస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.