సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి
సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలి
-పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, శోధన న్యూస్ : ఈ నెల 11వ తేదీన మణుగూరు మండలం ముత్యాలమ్మనగర్లో జరిగే తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండలంలోని గుట్టమల్లారం హనుమాన్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, మణుగూరుకు రానున్నారన్నారు. మణుగూరులో భారీ బహిరంగ సభలో పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం బహిరంగసభకు నియోజకవర్గం నుండి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, మణుగూరు వైస్ఎంపిపి కరివేద వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చందా సంతోష్ కుమార్, కాటిబోయిన నాగేశ్వరరావు, పీరినాకి నవీన్, పుచ్చకాయల శంకర్, దొబ్బల వెంకటప్పయ్య, ఎంపిటిసి గుడిపూడి కోటేశ్వరరావు, సర్వేశ్వరరావు, పుచ్చకాయల శంకర్, తరుణ్ రెడ్డి, సుబ్బారెడ్డి, నియోజకవర్గంలోని మండలాల నాయకులు, పజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.