పోలీసు వాహనాలను తనిఖీ చేసిన సీపీ
పోలీసు వాహనాలను తనిఖీ చేసిన సీపీ
పెద్దపల్లి, శోధన న్యూస్ : పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమీషనరెట్ పరిధిలోని పోలీసు వాహనాల పనితీరు వాటి నిర్వహణను రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్(ఐజీ) కమీషనరెట్ హెడ్ క్వార్టర్స్ లో పరిశీలించారు. వాహనల పనితీరు, నిర్వహణపై రామగుండం ఎంటిఓ కన్నం మధు, బెల్లంపల్లి ఎంటిఓ శ్రీనివాస్ లు నివేదికను సీపీ కి అందజేశారు. ఈ సందర్భంగా సీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ…..రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జోన్ లలోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో గల పోలీస్ వాహనాలు నిరంతరంగా వివిధ ప్రజాసేవలకు, ఎలాంటి ఆటంకం కలగకుండా సాఫీగా ప్రజా సేవలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. వాహనాల నిర్వహణ లోటుపాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదికను నెలవారీగా సమర్పించాలని మోటార్ వాహనాల అధికారులకు కు తెలియజేశారు వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించినారు. పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్, ఇంజన్ ఆయిల్, టైర్ల నిర్వహణ ఉత్తమ ప్రమాణాలను పాటించుకుంటూ డ్రైవర్లకు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏ ఆర్ ఏసీపీ సుందర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్, ఎంటిఓలు మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.