తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

నిష్పక్షపాతంగా ఎన్నికల విధులను నిర్వహించాలి 

నిష్పక్షపాతంగా ఎన్నికల విధులను నిర్వహించాలి 

-అదనపు బ్యాలెట్, యూనిట్ల ఎఫ్ఎల్ సి, ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి

-వంద శాతం ప్రతి ఓటరుకు ఓటర్ సమాచార స్లిప్పు పంపిణీ చేయాలి

-పోలింగ్ సిబ్బందికి అవసరమైన మౌళిక వసతులు కల్పించాలి

-డబ్బు, మధ్యం పంపిణీ జరగకుండా పక్కా నిఘా ఏర్పాటు

-సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలి

– సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమీషనర్ నితేష్ వ్యాస్

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : లోక్ సభ ఎన్నికల విధులను ప్రతి ఒక్కరు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిని ఒకే తరహాలో చూడాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమీషనర్ నితేష్ వ్యాస్ అన్నారు. గురువారం న్యూ ఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన వీడియో సమావేశంలో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసిపాల్గొనగా, ఐ డి ఓ సి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా , ఎస్పీ రోహిత్ రాజ్ , వ్యయ పరిశీలకులు రామ్ కుమార్ గోపాల్ ఐ ఆర్ ఎస్ లతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమీషనర్ నితేష్ వ్యాస్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో పారదర్శకంగా విధులు నిర్వహించాలని, అందరినీ సమానంగా చూడాలని ఎవరి పట్ల పక్షపాతంతో వ్యవహరించడం చేయవద్దని తెలిపారు. ఎన్నికల విధులు భారత ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పక్కాగా జరగాలని, ఎక్కడా ఏచిన్న పొరపాటు రాకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పోటీలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలకు అదనపు బ్యాలెట్ యూనిట్లు చేరుకున్నాయని, ఈవిఎం బ్యాలెట్ యూనిట్ల ఎఫ్ఎల్ సి, ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని, హోమ్ ఓటింగ్ ప్రక్రియను నిబంధనల ప్రకారం మే 8 నాటికి పూర్తి చేయాలని, హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలియజేయాలని ఆయన సూచించారు. లోక్ సభ ఎన్నికల పోలింగ్ కంటే ముందుగానే వంద శాతం ఓటర్ సమాచార స్లిప్పులు ప్రతి ఒక్క ఓటర్ కు అందేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రం లొకేషన్ ఓటర్లకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ కేంద్రం వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఆహారం, ఇతర వసతులు కల్పించాలని అన్నారు. సకాలంలో పోలింగ్ ప్రారంభం కావాలని, పోలింగ్ కంటే ముందు మాక్ పోల్ నిర్వహించాలని, పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.

సెక్టార్ అధికారులు విజయవంతంగా పోలింగ్ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాలని, ఈవీఎం యంత్రాలు పనిచేయని పక్షంలో నూతన ఈవిఎం యంత్రం ఏర్పాటు చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై సెక్టార్ అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ అందజేయాలని తెలిపారు. పోలింగ్ రోజున జిల్లా కేంద్రాలలో నిపుణులైన అధికారులచే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పోలింగ్ తేది దగ్గరపడుతున్న సమయంలో డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, సి విజిల్ యాప్ వినియోగంపై ప్రజలు విశిష్ట ప్రచారం కల్పించాలని, పోలింగ్ శాతం పెరిగే విధంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.సైలెన్స్ పీరియడ్ లో ఎటువంటి డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలన్స్, వీడియో సర్వేలెన్స్, అకౌంటింగ్ బృందాలు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ డబ్బు, మద్యం పంపిణీ కాకుండా చూడాలని అన్నారు. లోక్ సభ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, పోలింగ్ నిర్వహణ పట్ల సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న, చిన్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆలా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 71శాతం ఓటర్ సమాచార స్లిప్పులు పంపిణీ చేశామని, మిగిలిన ఓటర్లకు సైతం పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లా కు కొత్తగా కేటాయించిన1700 బ్యాలెట్ యూనిట్లను రెండు రోజుల్లో రాండిమైజేషన్ పూర్తి చేసి అన్ని నియోజకవర్గాలకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రభావం లేకుండా అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు చేపట్టామని అన్నారు.

సి విజల్, 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, జిల్లాలోపారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న * ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ , పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామని, ఈవీఎం యంత్రాల తరలింపు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రభావం ఉండకుండా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని, అక్రమ డబ్బు, మద్యం పంపిణీ కాకుండా గట్టి వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వ్యయ పరిశీలకులు రామ్ కుమార్ గోపాల్ ఐ ఆర్ ఎస్ మాట్లాడుతూ అన్ని చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలన చేపట్టాలని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా నిరంతరంగా నిఘా ఏర్పాటు చేయాలని, ఎం సి సి లో ఎఫ్ ఎస్ టి, వి ఎస్ టి లో మోడల్ కండక్ట్ కోడ్ ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలను నివేదికలను సమర్పించాలని ఆయన తెలిపారు.ఎటువంటి సంఘటననైనా సీసీ కెమెరాలు ద్వారా పరిశీలన చేయాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా డబ్బు మద్యం తదితర వస్తువులు పట్టుబడిన సందర్భంలో వీడియో రికార్డింగ్ తప్పనిసరిగా రికార్డు చెయ్యాలని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలు మీటింగ్స్, బ్యానర్లు మొదలైన సామాగ్రిపై వీడియో సర్వే లైన్స్ టీం రికార్డు చేపట్టాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *