పారిశ్రామిక వేత్తలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
పారిశ్రామిక వేత్తలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
సూర్యాపేట ,శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్రములో పారిశ్రామిక వేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి కావలసిన వసతులు కల్పించి, మెరుగైన విద్యుత్ సరఫరా చేసి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట రూరల్ మండలం గాంధినగర్ నందు యువ పారిశ్రామిక వేత్త కంకణాల వెంకట పద్మజ హర్ష నెలకొల్పిన కెవిఆర్ స్టీల్ ఇండస్ట్రీ ని మాజీ మంత్రి, నియోజకవర్గం ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి తో కలిసి మంత్రి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా లో పరిశ్రమల స్ధాపనకు యువ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని అన్నారు. పరిశ్రమల స్ధాపన ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. కెవి రామారావు సంస్మరణార్దం ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి సరఫరా పధకాన్ని మంత్రి ప్రారంభించారు.