భువనగిరి లో కాంగ్రెస్ గెలుపు తద్యం
భువనగిరి లో కాంగ్రెస్ గెలుపు తద్యం
– సీఎం రేవంత్ రెడ్డి
జనగామ,శోధన న్యూస్: భువనగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని అన్నారు. గెలుపు కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని కోరారు. నియోజకవర్గ ముఖ్య నేతలు ఐక్యంగా పనిచేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వెళ్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజాపాలనకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.