ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
-వంద శాతం ఓటు నమోదు స్వీప్ కార్యక్రమాలు.
-సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి
సంగారెడ్డి,శోధన న్యూస్: లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే లా అన్ని పార్టీల రాజకీయ నాయకులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టర్ ఛాంబర్ లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 16న ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిందని ఏప్రిల్ 18 న నోటిఫికేషన్,25న నామినేషన్స్ స్వీకరణకు చివరి తేదని,26న నామినేషన్ల స్కూటీని,29 న నామినేషన్ల ఉపసంహరణ, మే 13 న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గం లోని 7,అసెంబ్లీ నియోజకవర్గాలలో ఫ్లైయింగ్ స్క్వాడ్స్ 24×7 మూడు షిఫ్ట్ లలో ఎస్ ఎస్ టి, వి ఎస్ టి, ఎక్స్పెండిచర్ టీమ్స్ పనిచేస్తాయని అన్నారు. నగదు రవాణా, ఆక్రమ మద్యం అరికట్టేందుకు ఆర్టిఏ, ఇన్కమ్ టాక్స్, ఎక్సైజ్, ఈడి, జీఎస్టీ, కస్టమ్స్, నారో ట్రిక్స్ మరియు పోలీస్ అధికారులను ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్స్ వద్దా నియమించడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు సమావేశాలకు సింగిల్ విండో సిస్టం సువిధ యాప్ ద్వారా అనుమతులు అందిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమాలి అమలులోకి వచ్చినందున మతం, కులం, ప్రాంతం పై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం తప్పుడు ప్రచారం చేయడం పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అడ్వర్టైజ్మెంట్ లు ప్రకటనల కోసం 48 గంటల ముందు ఎం సి ఎం సి దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలలో ఆక్రమాలు జరిగితే 1950 నెంబర్ ద్వారా, సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఎన్నికల ప్రవర్తనానియామావళిని ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి అన్నారు.
జిల్లాలో స్వీప్ కార్యాచరణ పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఓటు హక్కు పై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం , ఓటు ప్రాముఖ్యత తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టి చైతన్యం తెచ్చేలా కార్యక్రమాలు రూపొందించామని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అవచ్చేనెలా 15 వరకు ఓటరుగా నమోదుచేసుకలోవచ్చని తెలిపారు . యువత వంద శాతం ఓటు నమోదు చేసేలా స్వీప్ ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటరుగా నమోదు చేయాలనీ, డబ్బు, మద్యం, బహుమతుల ఎన్నికల వేళ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా అభ్యర్థులను ఎన్నుకున్నట్లైతే తిరిగి వారి నుండి మనం మంచిని ఆశించవచ్చన్న విషయాన్ని యువ ఓటర్లకు తెలియజేయడం కనీస భాద్యత అని అన్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయడం ద్వారా వంద నిమిషాలలో ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఓటు హక్కు పై అవగాహన కల్పించే విధంగా ప్రసారాలు చేయవచ్చన్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశామని అన్నారు , స్వచ్ఛత, శానిటేషన్ ఆటోల ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందేలా చూడాలన్నారు. హై స్కూల్, కళాశాలల్లో సంకల్ప పత్రాలు పంపిణి చేయాలని, అట్టి పత్రల పై తల్లిదండ్రుల సంతకాలు సేకరించాలని ఆమె అన్నారు.. ప్రతి నియోజక పరిధిలో స్వీప్ ప్రోగ్రాం కోసం బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని, పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతి కూడలి వద్ద ఓటు హక్కు గురించి ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఓటు హక్కు దేశంలోని ప్రతి ఒక్కరికి సమానమని అందరికి సమాన స్వేచ్ఛ, హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు.