ముత్తాపురంలో కార్డన్ అండ్ సెర్చ్
ముత్తాపురంలో కార్డన్ అండ్ సెర్చ్
ఆళ్లపల్లి, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను సూచనలతో ఆళ్ళపల్లి ఎస్సై రతీష్ఆ ధ్వర్యంలో మండలంలోని గుత్తికొయ గ్రామమైన ముత్తాపురంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించారు. అనంతరం గ్రామస్తులందరితో సమావేశమై అక్కడ నివసించే 11 కుటుంబాలతో సమావేశమయ్యారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు. అలాగే నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని గ్రామస్తులకు ఎస్సై రతీష్ సూచించారు. దోమల బారిన పడకుండా ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డెంగ్యూ మరియు మలేరియా లాంటి విష జ్వరాల ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని గ్రామస్తులకు సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్ఎస్ పి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.